ఆన్‌స్క్రీన్‌పై సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మీ జోడీ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దానిపై వారిని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వచ్చారు. తాజాగా సుధీర్ మరోసారి రష్మీతో పెళ్లి గురించి రియాక్ట్ అయ్యాడు. తాను హీరోగా నటించిన ‘కాలింగ్ సహస్ర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. ”రష్మితో పెళ్లెప్పుడు?” అని మీడియా వారు ప్రశ్నించగా.. ”మా జోడీ ఆన్‌స్క్రీన్ వరకే. ఇదే ప్రశ్న తరచూ అందరూ అడుగుతున్నారు. దానికి కారణం జనం అంతగా మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నా పెళ్లి గురించి ఆలోచనే లేదు. హ్యాపీగానే ఉన్నా. కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నా. దేవుడు ఏదైనా ప్లాన్ చేస్తే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా” అని సుధీర్ సమాధానం చెప్పాడు. సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాలా తెరకెక్కించిన ‘కాలింగ్ సహస్ర’ డిసెంబరు 1న విడుదల కానుంది.