ఆ చీఫ్‌ సెలక్టర్‌ వల్లే ఆడలేకపోయా- షమి

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి వన్డే వరల్డ్‌ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా మెగాటోర్నీ తుదిజట్టులో చోటు సంపాదించిన షమి తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టాడు. టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ బోర్డు గురించి షమి సంచలన కామెంట్లు చేశాడు. అతని సొంత రాష్ట్రమైన యూపీ నుంచి రంజీల్లో ఆడకపోవడానికి గల కారణాన్ని వివరించాడు. ”యూపీ నుంచి కాకుండా పశ్చిమ బెంగాల్‌ నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడా. నా ఎంపిక గురించి అప్పటి యూపీ చీఫ్ సెలక్టర్‌ ఇచ్చిన సమాధానానికి షాక్‌కు గురయ్యా. నా ఎంపిక గురించి మా అన్నయ్య వెళ్లి చీఫ్‌ సెలక్టర్‌ను కలిశాడు. అప్పుడు ఆ సెలక్టర్‌..‘నా కుర్చీని కదిలించగలిగితేనే ఆ కుర్రాడు సెలక్ట్‌ అవుతాడు’ అని మా అన్నయ్యతో చెప్పాడు. దాంతో అప్పటి నుంచి యూపీ క్రికెట్‌లో భాగస్వామ్యం కాలేదు. 14 ఏళ్ల వయసులో కోల్‌కతాకు మారిపోయా” అని షమి చెప్పాడు.

Related posts

అప్పట్లో జడేజాపై నిషేధం- హార్దిక్‌పై వేటు తప్పదా?

తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా

‘తేజస్‌’ యుద్ధ విమానంలో మోడీ.. ఫొటోలు వైరల్