‘తేజస్‌’ యుద్ధ విమానంలో మోడీ.. ఫొటోలు వైరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘తేజస్’ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించిన మోడీ.. ఈ సందర్భంగా తేజస్‌ ట్విన్‌ సీట్‌ ట్రైనర్‌ వేరియంట్‌లో విహరించారు. అనంతరం ఆ ఫొటోలను ప్రధాని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘తేజస్‌ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశాను. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంతో మన స్వదేశీ సామర్థ్యంపై నా విశ్వాసం మరింత పెరిగింది. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల నాకు గర్వంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. తేజస్‌.. తేలికపాటి యుద్ధవిమానం. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ యుద్ధ విమానాన్ని తొలుత వాయుసేన కోసం HAL రూపొందించింది. ఆ తర్వాత గ్రౌండ్‌ మారిటైమ్‌ ఆపరేషన్స్‌ కోసం.. నావెల్‌ వేరియంట్‌ను కూడా పరీక్షిస్తున్నారు.

Related posts

అప్పట్లో జడేజాపై నిషేధం- హార్దిక్‌పై వేటు తప్పదా?

తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా

ఆ చీఫ్‌ సెలక్టర్‌ వల్లే ఆడలేకపోయా- షమి