Keerthy Suresh reacts to her Marriage
Home » పెళ్లి పుకార్లు ఖండించిన కీర్తిసురేష్

పెళ్లి పుకార్లు ఖండించిన కీర్తిసురేష్

by admin
0 comment

కీర్తిసురేష్ పెళ్లిపై వస్తున్న పుకార్లు ఇప్పటివి కాదు. కొన్నేళ్లుగా ఆమె పెళ్లిపై పుకార్లు నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తి తెరపైకి వస్తుంటాడు. ఈసారి కూడా అదే జరిగింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. అయినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి తరచుగా మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది నటులు, వ్యాపారవేత్తలతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ ఎప్పటికప్పుడు కథనాలు వస్తున్నాయి.

ఇటీవల కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తకు శుభాకాంక్షలు తెలిపింది. ఫర్హాన్ బిన్ లియాఖత్ పుట్టినరోజు సందర్భంగా, అతడితో దిగిన ఫొటోను కీర్తిసురేష్ షేర్ చేసింది. దీంతో 30 ఏళ్ల కీర్తిసురేష్ లైఫ్‌లో మిస్టరీ మ్యాన్ అతనే అనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకుముందు ఆమె మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, ప్రముఖ కోలీవుడ్ సూపర్ స్టార్‌తో ఎఫైర్లు సాగించినట్టు వార్తలు వచ్చాయి. వీటితో పాటు కేరళలోని రిసార్ట్ యజమానితో కూడా ఆమెకు లింక్ పెట్టారు. అయితే వీటిని కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఖండించారు. ఆమె ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టిందని, వివాహం ఇప్పట్లో ఉండదని వివరించారు. ఇప్పుడీ తాజా రూమర్లపై స్వయంగా కీర్తిసురేష్ స్పందించింది. ఈసారి నా పెళ్లి రూమర్లలోకి నా ప్రియ స్నేహితుడిని కూడా లాగేశారు అంటూ నవ్వుతూ ట్వీట్ వేసింది. సమయం వచ్చినప్పుడు తన మిస్టరీ మ్యాన్‌ని బయటపెడతానంటూ ప్రకటించింది.

మొత్తానికి తన జీవితంలో ఓ మిస్టరీ మ్యాన్ ఉన్నాడనే విషయాన్ని కీర్తిసురేష్ కన్ ఫర్మ్ చేసింది. దీంతో ఆమె ప్రేమ-పెళ్లిపై మరిన్ని పుకార్లు చెలరేగాయి. ప్రస్తుతం కీర్తిసురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె చిరంజీవికి చెల్లెలిగా భోళాశంకర్ సినిమా చేస్తోంది. వీటితో పాటు మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links