ఇలియానా ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పండంటి ఆ మగబిడ్డకు ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అని పేరు పెట్టింది. అయితే బాబు తండ్రి ఎవరనే విషయాన్ని చెప్పలేదు. తాజాగా ఆ సస్పెన్స్‌ను బ్రేక్ చేసింది ఇలియానా. తాను సింగిల్ పేరెంట్ కాదని.. లైఫ్ పార్ట్నర్ను పరిచయం చేసింది. ఇన్‌స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో ఓ నెటిజన్ ‘మీ బిడ్డను ఒంటరిగా ఎలా పెంచుతున్నారు?’ అంటూ ప్రశ్నించగా.. ‘నేను సింగిల్ పేరెంట్ కాదు’ అంటూ తన పార్ట్నర్ ఫొటోను షేర్ చేసింది ఈ గోవా బ్యూటీ. అయితే అతడి పేరు, పెళ్లి వివరాలు మాత్రం చెప్పలేదు. గతంలో ‘డేట్ నైట్’ అంటూ లవ్ సింబల్‌ను యాడ్ చేసి ఓ వ్యక్తితో ఉన్న ఫొటోను ఇలియానా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తే తన పార్ట్నర్గా ఇప్పుడు పరిచయం చేసింది. ఇక ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో చివరిసారిగా తెలుగుతెరపై కనిపింది.
118
previous post