వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీని అందుకున్న అనంతరం ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీటిని ఐసీసీ కూడా షేర్ చేసింది. అయితే మార్ష్ భారతీయుల మనోభావాలను గాయపరిచినట్లుగా కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్.. దిల్లీ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రోఫీని అవమానించడంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల సెంటిమెంట్‌ను గాయపరిచాడని కంప్లైంట్‌లో పండిట్ కేశవ్ రాసుకొచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారో చూడాలి!