Bluewhale: శ్రీకాకుళంలో నీలి తిమింగలం..సెల్ఫీలతో జనం

తెలుగు ఉభయ రాష్ట్రాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లు జలమయ్యాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో నీలి తిమింగళం (Bluewhale) కొట్టుకొచ్చింది. సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి ఈ అరుదైన బ్లూవేల్ కొట్టుకొచ్చింది. ఇది సుమారు 25 అడుగులు పొడవు, 5 టన్నులు బరువు ఉంది.

అయితే ఈ నీలి తిమింగళాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ బ్లూవేల్‌ను చూడటానికి వచ్చినవారు సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నారు.

Related posts

అప్పట్లో జడేజాపై నిషేధం- హార్దిక్‌పై వేటు తప్పదా?

తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా

‘తేజస్‌’ యుద్ధ విమానంలో మోడీ.. ఫొటోలు వైరల్