match
Home » పసికూనపై పోరు.. బుమ్రా, రింకూ కోసం వెయిటింగ్‌

పసికూనపై పోరు.. బుమ్రా, రింకూ కోసం వెయిటింగ్‌

by admin
0 comment

ఐర్లాండ్‌తో నేటి నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. పసికూన ఐర్లాండ్‌తో సిరీస్‌ అంటే టీమిండియానే ఫేవరేట్‌. కానీ ఇప్పుడు అందరి చూపు జస్ప్రీత్ బుమ్రా, రింకూ సింగ్‌పైనే ఉంది. గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్‌ ఫినిషర్‌గా సంచలన ప్రదర్శన చేసిన రింకూకు తొలిసారి అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పసికూనతో పోరైనా.. వీరిద్దరి ప్రదర్శన ఎలా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా కొన్ని రోజుల్లోనే మెగా టోర్నీలు ఆసియా కప్‌, ప్రపంచకప్‌ ఉండటంతో ఈ సిరీస్‌ ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌లో సత్తాచాటిన వారిని మెగాటోర్నీలకు సెలక్టర్లు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అయితే కెప్టెన్‌తోపాటు సహాయ సిబ్బందీ అంతా కొత్త వాళ్లే. జట్టును బుమ్రా నడిపించనున్నాడు.

ఈ సిరీస్‌ సంజు శాంసన్‌, తిలక్‌ వర్మకు కూడా ఎంతో కీలకం కానుంది. నాలుగో స్థానంలో ఆటగాడిని వెతికే ప్రయత్నంలో ఉన్న సెలక్టర్లు బ్యాటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వెస్టిండీస్‌ సిరీస్‌లో రాణించిన తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఈ సిరీస్‌లోనూ మెరిస్తే మెగాటోర్నీ ఎంపికకు దాదాపు ఖరారైనట్లే. మరోవైపు మెగాటోర్నీలకు జట్టులో స్థానం సంపాదించాలంటే శాంసన్‌ తప్పక మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

జట్టు వివరాలు
యశస్వీ జైశ్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌, శివమ్‌ దూబె, రింకూ సింగ్‌, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అర్షదీప్ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, ప్రసిద్ధ కృష్ణ, షాబజ్‌ అహ్మద్‌.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links