వనమాకు చుక్కెదురు..పిటిషన్‌ కొట్టివేత

వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం కోసం ఈ తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని వనమా పిటిషన్‌ వేశారు. తాజాగా దీనిని ధర్మాసనం కొట్టివేసింది.

కాగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2018 డిసెంబరు 12 నుంచి తననే గుర్తిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని జలగం వెంకట్రావు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో బుధవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. స్పీకర్‌ సూచనల మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుకు వినతిపత్రం అందించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ను కలిసి హైకోర్టు తీర్పు కాపీతోపాటు వినతిపత్రం అందజేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..