తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతం (51 సెం.మీ.) రికార్డును బద్దలుకొట్టింది. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ., 200 కేంద్రాల్లో 10 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కాగా, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతలు జలమయ్యాయి. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింన సంగతి తెలిసిందే.