TS Assembly Sessions: ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Monsoon Sessions) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. 29, 30వ తేదీల్లో ఉద్యోగులు విధులకు హాజరు కావాలని చెప్పారు.

కాగా, మరోవైపు జులై 31 తేదీన మధ్యాహ్నం 2 గంటల కు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద కేబినేట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంది.

భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ రంగ ప్రస్తుత పరిస్థితులను అంచనావేసి, అనుసరించవలసిన విధానాలపై కేబినేట్‌ చర్చించనుంది. వరదల దృష్ట్యా దెబ్బతిన్న రవాణమార్గాలపై కూడా చర్చ జరగనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉందని తెలుస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..