తగ్గని వాన.. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. గత మూడు రోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న వరుణుడు శుక్రవారం కూడా శాంతించలేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అంతేగాక వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి.

పరవళ్లు తొక్కుతున్న నదులతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ముందస్తు చర్యలు చేపడుతుంది. మరోవైపు కడెం ప్రాజెక్ట్‌లో భారీగా వరద నీరు చేరుతుంది. అయితే ప్రాజెక్టు వద్ద ఎలక్ట్రిక్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ప్రాజెక్టులోని కొన్ని గేట్లు మొరాయిస్తున్నాయని సమాచారం. హుస్సేన్ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లోనూ నీటిమట్టం భారీగా పెరిగింది.

కాగా, మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..