అలర్ట్‌: మరో 3 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రాగల అయిదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు దక్షిణ ఒడిశా పరిసరాలలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది.

కాగా, గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలు జలమయ్యాయి. వరద నీటితో మూసి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నది సమీప ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లో వరద నీరు పెరగడంతో 4 గేట్లను తెరిచారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..