కిషన్ రెడ్డిని అయినా పని చేసుకోనివ్వండి: బండి సంజయ్‌

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనపై కొంతమంది ఫిర్యాదులు చేశారని, ఇకనైనా కిషన్‌రెడ్డిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలన్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని, కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని పార్టీ నేతలను బండి సంజయ్ కోరారు. తన మీద కొంత మంది ఫిర్యాదులు చేశారని తెలిపారు. అయినా అధ్యక్షుడిగా తన కర్తవ్యం నెరవేర్చానన్న సంతృప్తి ఉందన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని తెలిపారు. వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో నరేంద్రమోదీని అడ్డుకోలేరని అన్నారు. తెలంగాణలో బుల్డోజర్‌ ప్రభుత్వం రావాలని అన్నారు. కాగా, కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ కేంద్రమంత్రిగా ఎదిగానని, 4వసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ తనకు అవకాశం కల్పించిందన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..