తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది.