170
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన విమానం, పుష్ప చైల్డ్ ఆర్టిస్ట్ ధ్రువన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ ధ్రువన్ కూడా చేరాడు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాడు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కు థ్యాంక్స్ కూడా చెప్పాడు.
ధ్రువన్ మాట్లాడుతూ.. “సంతోష్ అంకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటాను. మొక్కలతో ఫ్రెండ్ షిప్ చేస్తే ఎంత బాగుంటుందో మొక్కను నాటాకే తెలుస్తుంది. మనకు పచ్చదనం, మంచి గాలి కావాలంటే మొక్కలు కావాలి. సంతోష్ అంకుల్ మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతో, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అందుకే మనం అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలి. అందరు సంతోష్ అంకుల్ చెప్పినట్టు మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.”