- వాహనంపై ఖాలి కుర్చీపై కేసీఆర్ ఫోటోతో ఊరేగింపు
- పెద్ద ఎత్తున రంగారెడ్డి, పాలమూరు జిల్లా ల నుండి ర్యాలితో తరలి వెళ్ళిన నేతలు
- ర్యాలీలో పాల్గొన్న టి. ఆచారి, మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో చలో లక్ష్మీదేవి పల్లి ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి తరలివచ్చారు భారీ వాహనశ్రేణితో చౌరస్తా నుండి ప్రదర్శనతో బయలుదేరారు. ఈ సందర్భంగా ఓ వాహనంపై ఖాళీ కుర్చీలో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి ఊరేగించుకుంటూ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ స్థలం వద్దకు చేరుకున్నారు. రిజార్వాయర్ స్థలం వద్ద KCR చిత్రపటం ఉన్న కుర్చీని పెట్టారు.
బిజెపి నాయకుడు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సాగునీరు కోసం ఖజానా నుండి రెండు లక్షల కోట్లు ఖాళీ చేశాడని రంగారెడ్డి పాలమూరు జిల్లాలకు రెండు చెంబుల నీళ్లు కూడా ఇవ్వలేదు అన్నాడు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆచారి మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు నీళ్లు తెస్తే రైతులు ఈ భూములు అమ్మరని నీళ్లు తేకుండా ఉంటే రైతుల నుండి లాక్కొని బడా వ్యాపారులకు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారని అన్నారు. 8 వ తారీకున బద్వేలు లో భూములు అమ్మకానికి పెడుతున్న వేలాన్ని అడ్డుకుంటామని అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. 9 ఏళ్ళుగా ప్రాజెక్టు కడతామంటూ కాలయాపన చేశారంటూ విమర్శించారు. రాబోయే ఎన్నికలలోపు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని, లేకపోతే బిజెపి తరఫున ఆందోళనలు తీవ్రం చేస్తామన్నారు కేసీఆర్ కుర్చీ వేసుకొని కడతామన్న ప్రాజెక్టు స్థలం వద్ద కుర్చీ తెచ్చి వేసామన్నారు . ఎప్పుడు వచ్చి కడతారో వేచి చూస్తామన్నారు.