ఆదివాసీ మహిళను హత్య చేసిన నిందితుల అరెస్ట్

  • వివరాలు వెల్లదించిన ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్

భిక్షాటన చేసి బస్ షెల్టర్ లో ఉన్న ఆదివాసీ మహిళను హాత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. గురువారం డిఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దనోర (బీ) గ్రామంలో ఓ ఆదివాసీ మహిళ ఈ నెల 20 భిక్షాటన చేసి రోడ్డు పక్కన ఉన్న బస్ షెల్టర్ వద్దకు వెళ్లి ఉంది. దనోర (బీ ) గ్రామానికి చెందిన సుముక్ రావ్ సంతోష్, పసారే సంతోష్, షేక్ ఖదీర్ ముగ్గురు కూడా మహిళను హత్యాచారం చేశారు. ఈ విషయం గ్రామస్తులకు ఎక్కడ చెప్పుతుందోనని హత్య చేసి గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడేశారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజుల తర్వాత అటుగా వెళ్లిన గ్రామస్తులు మృతదేహాం ఉందని అందరికి తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి నార్నూర్ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లి ఎస్సై సునీల్ తో పాటుగా 4బృందాలుగా ఏర్పడి విచారించడంతో గ్రామానికి చెందిన వ్యక్తులే హత్యచారం చేసి హత్య చేసినట్లు నిర్దారణ అయిందన్నారు. ముగ్గురు నిందితులను రెండు రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేసి వారి పై హత్య, హత్యాచారం, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నార్నూర్ సీఐ ప్రేమ్ కుమార్, ఇంద్రవెళ్లి, ఉట్నూర్ ఎస్సైలు, సునీల్, భరత్ సుమన్ ఉన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..