గత రెండు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు మళ్లీ తిరిగొచ్చాడు. హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రేపటి ఉదయం వరకు వాన పడే అవకాశం ఉంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్, బోరబండ పరిధిలో వర్షం కురుస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగం బజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, పాతబస్తీలోని తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది.
కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాగా, వర్షాలపై నగరవాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రేపు ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. సహాయక చర్యల కోసం 040 21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.