telugu news

గ్రామ స్వరాజ్యం సాధించాం: CM Jagan

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జెండా ఎగురువేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…

Read more

PM Modi- ఆశ్వీరదిస్తే మళ్లీ వస్తా: మోదీ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన దిగువ, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త తెలిపారు. వారికి పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాకారానికి కొత్త…

Read more

Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు…

Read more

Chandrayaan-3: చరిత్రకు చేరువలో చంద్రయాన్‌-3

చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్‌-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ…

Read more

Tirumala: అలిపిరిలో మరో 5 చిరుతల అలజడి

తిరుమల అలిపిరి కాలినడక పరిసరాల్లో చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో అయిదు చిరుతులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల ఫుటేజీ రికార్డు అయ్యిందని వెల్లడించారు. మరోవైపు శ్రీవారి మెట్టు…

Read more

TSRTC: స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌.. టికెట్లపై రాయితీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌ న్యూస్ తెలిపింది. ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. అయితే ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన వారికి…

Read more

Himachal Pradesh: శివాలయంపై పడిన కొండచరియలు..9 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి రాష్ట్ర ప్రజలు అతలాకుతలమవుతున్నారు. కొన్ని గ్రామాలు, ప్రాంతాలు జలమయ్యాయి. తాజాగా సిమ్లాలోని ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మరణించారు.…

Read more

Bapatla:పోలీసుల సాహసానికి సెల్యూట్‌.. ప్రాణాలు కాపాడారు

సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను పోలీసు సిబ్బంది కాపాడారు. ప్రమాదాన్ని వెంటనే గుర్తించి పోలీసులు సాహసం చేయడంతో ఎవరికీ ప్రాణ హాని కలగలేదు. ఈ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…

Read more

INDvWI: సిరీస్‌ పోయింది.. సమాధానానికి సమయం లేదు!!

వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్‌ ఓటమిపాలైంది. దీంతో అయిదు టీ20ల సిరీస్‌ను (INDvWI) 2-3తో కోల్పోయింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి విమర్శలు పాలైన హార్దిక్‌ సేన.. తర్వాత మ్యాచ్‌ల్లో పుంజుకుని సత్తాచాటింది. 2-2తో సిరీస్‌ను…

Read more

TSPSC: గ్రూప్‌-2 పరీక్ష రీషెడ్యూల్‌ విడుదల

గ్రూప్‌-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. నవంబర్‌ 2,3 తేదీల్లో నాలుగు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.…

Read more