Team India కంటే IPL ముఖ్యమా? మండిపడ్డ Kapil Dev

టీమిండియా (Team India) సీనియర్‌ ప్లేయర్లపై దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టు కోసం కంటే ఐపీఎల్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని మండిపడ్డాడు. గాయాలను లెక్కచేయకుండా ఐపీఎల్‌ (IPL) ఆడతారని, కానీ టీమిండియా కోసం ఆటగాళ్లు అలాంటి రిస్క్‌లు చేయరని అన్నాడు. ఓ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.

”ఐపీఎల్‌ గొప్ప లీగే. కానీ అదే మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. చిన్న గాయాలతో మీరు ఐపీఎల్‌ ఆడతారు. టీమిండియా విషయంలో అదే పరిస్థితులు ఎదురైతే మాత్రం ఆడరు, విశ్రాంతి తీసుకుంటారు. దీనిని నేను చాలా ఓపెన్‌గా చెబుతున్నాను” అని కపిల్‌దేవ్‌ అన్నాడు. ఆటగాళ్ల పనిభారం, విశ్రాంతి నిర్వహణపై బీసీసీఐ కూడా సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించాడు.

గత కొన్ని రోజుల క్రితం టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లను కపిల్‌దేవ్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గవాస్కర్‌ సలహాలను తీసుకోవడానికి కూడా ఆటగాళ్లకి అహంకారం అడ్డువస్తుందని అన్నాడు. క్రికెట్‌ గురించి అన్ని తమకి తెలుసనే ధోరణీలో సీనియర్‌ ప్లేయర్లు ఉన్నారని ఘూటు విమర్శలు చేశాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం