భారత్‌ 100.. కోహ్లి 500

  • మనతో మనకేనా పోటీ?

వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ మంచి జోరులో ఉంది. తొలి టెస్టులో మూడు రోజుల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా టెస్టు సిరీస్‌లో చివరి సమరానికి సిద్ధమైంది. అయితే నేడు రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియాకు కరీబియన్‌ జట్టుతో ఇది 100వ టెస్టు కాగా, కోహ్లికి తన ప్రయాణంలో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. అయితే తొలిపోరులో కనీస ప్రతిఘటన లేకుండా ఓటమి చవిచూసినా ఆతిథ్య జట్టుపై అంచనాలు లేవని, రోహిత్‌ సేనే ఫేవరేట్‌ అని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కానీ టీమిండియా బెంచ్‌బలం గత కొన్ని ఏళ్లుగా పటిష్ఠమవ్వడంతో తుదిజట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్‌, కోచ్‌కు ఓ సవాలుగా మారింది.

మరోవైపు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని తుదిజట్టులో స్థిరపడటానికి ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసేలా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే యశస్వి జైస్వాల్‌ భారీశతకంతో చెలరేగి ఓపెనర్‌ స్థానంలో తానే సరైనోడినని సంకేతాలు విసిరాడు. ఓపెనింగ్‌ నుంచి మూడో స్థానానికి మారిన గిల్‌ గతంలో పరుగుల వరదతో నిరూపించుకున్నాడు.

ఇక టెస్టులో వికెట్‌ కీపర్‌గా అవకాశం అందుకున్న ఇషాన్‌ కిషాన్‌కు ఈ టెస్టు ఎంతో కీలకం కానుంది. మరోవైపు బౌలింగ్‌లోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఉనద్కత్‌ తొలి టెస్టులో ఒక్క వికెట్‌ కూడా సాధించలేదు. అయితే ఆ మ్యాచ్‌లో అతను చాలా తక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. మరి ఈ ప్రత్యేక టెస్టులో ఎంతమేర సత్తాచాటుతాడో చూడాలి. దీంతో స్థానం సుస్థిరం కోసం పోటీ మనలో మనకే అని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related posts

రింకూ.. ధోనీలా కనిపిస్తున్నాడు- సూర్యకుమార్‌

కారు యాక్సిడెంట్- ప్రాణాలు కాపాడిన షమి

ముంబయికి వచ్చేస్తున్నా.. హార్దిక్‌ ఎమోషనల్‌