ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలలపాటు ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రీమియం మెంబర్‌షిప్ అనేక రకాల కంటెంట్‌ను అందిస్తోంది. అంతేగాక బ్యాగ్రౌండ్‌లో వీడియోలు, ఆడియోను ప్లే చేసుకోవచ్చు. దాంతోపాటు మరెన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్ కోసం నెలకు రూ.139, మూడు నెలలకు రూ.399 చెల్లించాలి. కానీ యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంతో మూడు నెలలపాటు ఉచితంగా ప్రీమియం సేవలను పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు కొనుగోలు చేయని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
మూడు నెలల తర్వాత ప్రీమియం ప్లాన్ తనకు అవసరం లేదనుకొనే వినియోగదారులు.. ఆఫర్ గడువు ముగిసే లోపే ప్రీమియం ఖాతాను డియాక్టివేట్ చేసుకోవాలి. లేకుంటే బ్యాంకు నుంచి మనీ కట్ అవుతుంది. కాగా, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో యూట్యూబ్ పూర్తి వివరాలు వెల్లడించలేదు.