పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్ట్ 4వ తేదీకి వాయిదా వేసింది.
‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యల కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను తొలుత జిల్లా సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆయన పిటిషన్‌ను కొట్టేయడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా వ్యతిరేక తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.