మన ‘మైసూర్ పాక్’ని ప్రపంచం మెచ్చింది. అత్యంత విశిష్ట ఆదరణ పొందిన ప్రపంచ స్ట్రీట్ స్వీట్స్ జాబితాలో 14వ స్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్ నిర్వహించిన సర్వేలో మైసూర్ పాక్‌తో పాటు మరో రెండు భారత స్ట్రీట్ ఫుడ్స్ చోటు సంపాందించాయి. ఫలుదా, కుల్ఫీ ఫలుదా టాప్ 50లో నిలిచాయి.
మైసూర్ పాక్ ప్రపంచ గుర్తింపు పొందడంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ స్పందించారు. తమ రాష్ట్రానికి చెందిన తీపి వంటకానికి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయని, తన బంధువులతో ఈ స్వీట్‌ను పంచుకునేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రఖాతి చెందిన మైసూర్ పాక్.. తమిళనాడు వంటకమని, తర్వాత మైసూర్‌కు తరలించారని చెప్పుకుంటుంటారు. కానీ దీన్ని శివకుమార్ అంగీకరించలేదు. తమ రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతం పేరు తీపి వంటకానికి ఇంటిపేరుగా మార్చడంలో.. తమ రాష్ట్ర ప్రజల కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు.