Uttar Pradesh: పొరపడిన మహిళ.. భర్త అతడే అనుకొని

మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించింది ఓ మహిళ. తన కుమారులకు సమాచారం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లాక ప్రశ్నించగా అతడి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అనుమానం వచ్చి పుట్టుమచ్చలు చూస్తే అతడు తన భర్త కాదనే అసలు విషయం తెలిసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బలియా జిల్లాలో జరిగింది.

బలియా ప్రాంతంలోని దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్‌ వర్మకు 21 ఏళ్ల క్రితం జానకీదేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత మోతీచంద్‌ మానసిక పరిస్థితి క్షీణించడంతో వైద్యం కోసం బంధువులతో కలిసి నేపాల్‌కు వెళ్లాడు. అక్కడే తప్పిపోయి ఆచూకీ లేకుండా పోయాడు. భర్త గురించి తెలుసుకునేందుకు జానకీదేవి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో శనివారం బలియా జిల్లా ఆస్పత్రి రోడ్డు పక్కన చిరిగిన పాత దుస్తులు, పెరిగిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసి మోతీచంద్‌ అనుకొని జానకి సంబరపడిపోయింది. కుమారులకు పరిచయం చేసి ఇంటికి తీసుకువెళ్లింది. అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పుట్టుమచ్చలు పరిశీలించిన జానకీదేవికి జరిగిన పొరపాటు తెలిసివచ్చి ఆ వ్యక్తిని క్షమాపణలు కోరింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం