మణిపుర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం

మణిపుర్‌లో అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను దుండగులు సజీవ దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో మే 28 తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకున్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. ఆమె ఇంట్లో ఉండగా దుండగులు తలుపు గడియ పెట్టి ఇంటికి నిప్పుపెట్టారు. రక్షించేందుకు కుటుంబీకులు చేరుకొనేసరికే ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత వెల్లడించారు. అతనిపై కూడా దుండగులు కాల్పులు జరపగా గాయాలయ్యాయి. కాగా, చురచాంద్‌ సింగ్‌ స్వాతంత్ర్య సమయయోధుడు. గతంలో ఆయన అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం