ఈ వీకెండ్ 7 సినిమాలు

ఈ వీకెండ్ 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కానీ లైట్ తీసుకునే సినిమాలు మాత్రం కావు. మరీ ముఖ్యంగా 4 సినిమాలు ప్రేక్షకుల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ 4 సినిమాలేంటో చూద్దాం..

బాగా బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో మొదటిది మళ్లీ పెళ్లి అనే సినిమా. నరేష్-పవిత్ర లోకేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఇది. వీళ్లిద్దరూ నిజజీవితంలో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఆ సహజీవనంలో జరిగిన ఘటనలతోనే ఈ సినిమా తెరకెక్కింది. అందుకే మళ్లీ పెళ్లి సినిమాపై అందరి కన్నుపడింది. నరేష్ తన భార్యకు విడాకులు ఇవ్వకుండా, పవిత్ర లోకేష్ తో లివ్-ఇన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అటు పవిత్ర లోకేష్ కూడా తన భర్తను వదిలేసి నరేష్ తో ఉంటున్నారు. వీళ్లిద్దరి వ్యవహారం వార్తల్లోకి ఎక్కడమే కాదు, పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. అవన్నీ మళ్లీ పెళ్లి సినిమాలో ఉన్నాయంటున్నాడు నరేష్.

ఈ సినిమాతో పాటు మేమ్ ఫేమస్, మెన్ టూ, 2018 అనే మరో 3 సినిమాలు కూడా వస్తున్నాయి. ఇవి కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మేమ్ ఫేమస్ సినిమా ప్రచారంతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు డిఫరెంట్ గా ప్రమోట్ చేశారు. విజయ్ దేవరకొండ, నాని, అడివి శేష్, నాగచైతన్య లాంటి హీరోలు.. హరీశ్ శంకర్, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్నారు. అలా ప్రమోషన్ తో ఆకట్టుకుంది ఈ సినిమా.

ఇక మెన్ టూ సినిమా ట్రయిలర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. తమ లైఫ్ పార్టనర్స్ తో ఇబ్బంది పడుతున్న కొంతమంది మగాళ్ల కథ ఇది. బ్రహ్మాజీ లాంటి నటుల పాత్రలు హిలేరియస్ గా ఉంటాయంట. ఇక 2018 అనే మలయాళ డబ్బింగ్ సినిమా కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. కేరళలో ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది. అందుకే ఈ సినిమా తెలుగు రిలీజ్ పై కూడా అంచనాలు పెరిగాయి.

వీటితో పాటు.. జైత్ర, గ్రే, హీరో ఇడియట్ అనే మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. మొత్తంగా ఈ శుక్రవారం 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400