మరోసారి కలిసిన హిట్ జోడీ

హీరో రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన నేనేరాజు నేనే మంత్రి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. వీరి కలయికలో రాబోతున్న సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

నేనేరాజు నేనేమంత్రి సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రకు మరింత బలంగా కొత్త సినిమాలో రానా క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు దర్శకుడు తేజ. నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట… రానా & తేజ కాంబినేషన్ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ మలయాళం స్టార్ హీరో నటించబోతున్నాడు.

రానా నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. అరణ్య సినిమా తర్వాత అతడు మళ్లీ వెండితెరపై కనిపించలేదు. రొటీన్ సినిమాలు చేయడం ఇష్టంలేకనే సినిమాలు తగ్గించినట్ట ఆమధ్య రానా ప్రకటించాడు. ఇందులో భాగంగా రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక అతడు చేయాల్సిన హిరణ్యకశిప ప్రాజెక్టు దాదాపు ఆగిపోయినట్టే.

అలా కెరీర్ లో గ్యాప్ ఎదుర్కొన్న రానా, ఇప్పుడు మరోసారి దర్శకుడు తేజతో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఆవిష్కరించబోతున్నారు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400