సీసీటీవీ లాంటి మెదడు నాది

తన మెదడును సీసీటీవీ ఫూటేజ్ తో పోల్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఏదైనా కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఒత్తిడి కలిగించే అంశాల్ని వెంటనే మరిచిపోవడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది.

సీసీటీవీ ఫూటేజ్ ఎలాగైతే నెల రోజుల తర్వాత రీసైక్లింగ్ అవుతుందో, అలానే తను కూడా మెదడును ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేసుకుంటానని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. ఉన్న చిన్న జీవితంలో, అతిగా ఎమోషనల్ అవ్వడం, టెన్షన్ పడడం అనవసరం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.

మనసులో ఒత్తిడి ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటోంది ఈ చిన్నది. కోపం వస్తే అప్పటికప్పుడు ప్రదర్శించాలని, ఆ వెంటనే ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలని చెబుతోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ సరసన ఈగల్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లూ స్క్ర్వేర్ అనే సినిమా కూడా చేస్తోంది.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400