sc
Home » Manipur:మణిపుర్‌ పోలీసులపై సుప్రీం ఆగ్రహం

Manipur:మణిపుర్‌ పోలీసులపై సుప్రీం ఆగ్రహం

by admin
0 comment

దేశాన్ని కుదిపేసిన మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని తీవ్రంగా మండిపడింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలకు 14 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని, ఆ సమయంలో ఏం చేశారని ప్రశ్నించింది. ఈ కేసుపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. కమిటీలో మహిళా జడ్జీలతోపాటు నిపుణులు కూడా ఉంటారని తెలిపింది. ఆ కమిటీ మణిపుర్‌లో పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడుతారని పేర్కొంది. తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

మే నెల ప్రారంభం నుంచి మణిపుర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనను అప్పుడే సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links