సూర్యుడు పడమరన ఉదయిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? అలానే మహేష్ బాబు గ్యాప్ ఇవ్వకుండా సినిమా చేస్తాడన్నా కూడా ఎవ్వరూ నమ్మరు. కానీ ఈసారి మాత్రం మేటర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. మహేష్ బాబు గ్యాప్ ఇవ్వడంట. వరుస షెడ్యూల్స్ తో త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేస్తాడట.
ఇంతకీ మహేష్ ఎందుకు ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో తెలుసా? ఈ మేటర్ తెలియాలంటే మనం ఇంకాస్త గతంలోకి వెళ్లాలి. మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలై చాన్నాళ్లయింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మహేష్ కుటుంబంలో దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. అలా గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత ఎందుకో మహేష్ కు కథ నచ్చలేదు.
త్రివిక్రమ్ ను మరోసారి పిలిపించాడు. ఏ కథ కోసం కొబ్బరికాయ కొట్టారో, ఆ కథను పక్కనపడేశారు. మరో కొత్త కథ సిద్ధం చేశారు. అప్పటికే షూట్ చేసిన చిన్న పోర్షన్ ను కూడా వదిలేశాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో మహేష్ విదేశీ పర్యనటకు వెళ్లాడు.
తిరిగొచ్చి మళ్లీ సినిమా స్టార్ట్ చేశాడు. ఈసారి షూటింగ్ అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో త్రివిక్రమ్ కు నచ్చలేదు. మహేష్-శ్రీలీల మధ్య మల్టీప్లెక్సులో తీసిన సన్నివేశాలు తనకు నచ్చలేదన్నాడు త్రివిక్రమ్. మళ్లీ వాటిని తీద్దామన్నాడు. దీంతో మహేష్ కు కోపం వచ్చింది. వెంటనే మరోసారి విదేశాలకు వెళ్లాడు.
ఈ గ్యాప్ లో తమన్ కొన్ని ట్యూన్స్ వినిపించాడు. అవి మహేష్ కు నచ్చలేదు. అసలు తమన్ వద్దనేది మహేష్ వాదన. త్రివిక్రమ్ పట్టుబట్టి తమన్ ను తీసుకొచ్చాడు. అప్పట్నుంచి ఆ సాంగ్స్ వ్యవహారం కూడా అలా సాగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో.. మరోసారి సెట్స్ పైకి రాబోతున్నాడు మహేష్. ఇప్పటికే షూట్ ఆలస్యం అవ్వడంతో.. వీలైనంత తొందరగా దీన్ని పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇకపై గ్యాప్ ఇవ్వడంట. సినిమా షూట్ కంప్లీట్ అయ్యేంతవరకు సెట్స్ లోనే ఉంటాడట. అదీ సంగతి.