ఇంటింటా తిరిగి చెత్త సేకరించే 11 మంది మహిళలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి రూ.250 జమచేసి కొన్న లాటరీ టికెట్‌కు రూ.10 కోట్ల భారీ నజరానా లభించింది. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో పరప్పణగాడిలో జరిగింది. వివరాళ్లోకి వెళ్తే…
పరప్పణగాడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ బృందంలోని సభ్యులు వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు. ఇందులో పనిచేస్తున్న 11 మంది మహిళలు కొద్ది వారాల క్రితం లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఆ సమయంలో లాటరీ టికెట్ ధర రూ.250 కూడా వారి వద్ద లేదు.
దీంతో తమ దగ్గరున్న చిల్లరంతా పోగు చేశారు. అలా ఆ 11 మంది రూ.250 జమచేసి లాటరీ టికెట్ కొన్నారు. కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ గత బుధవారం డ్రా తీయగా ఈ మహిళలు కొన్న టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్ మనీ రూ.10కోట్లు కావడంతో ఆ మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
11 Poor Women Pool Rs 250 To Buy Ticket Win Rs 10 Crore