అవిశ్వాస తీర్మానంపై (no-confidence motion) చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే లోక్‌సభలో ఎన్డీయే కూటమికి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. అవిశ్వాస తీర్మానం వీగి పోవడం ఖాయమే. కానీ మణిపుర్ అల్లర్ల అంశంపై ప్రధాని మాట్లాడాలనే ఉద్దేశంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. మరోవైపు మణిపుర్ అంశం గురించే గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల వాయిదా పర్వం కొనసాగుతోంది. దీనిపై హొంమంత్రి అమిత్‌షా మాట్లాడతారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రధానే స్పందించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.