ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్‌ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. మణిపుర్‌ ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మణిపుర్‌లో మరో ఆందోళన మొదలైంది. గత రెండు రోజుల్లో మయన్మార్‌ వాసులు దాదాపు 718 మంది చందేల్‌ జిల్లాలో అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది. వీరిలో 301 మంది పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నారని అస్సాం రైఫిల్స్ సెక్టార్‌ 28 పేర్కొంది. ఇప్పటికే అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న అధికారులకు ఇది మరొక సవాలుగా మారింది. తెగల మధ్య వైరం కారణంగా మణిపుర్‌లో రెండు నెలలకుపైగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం