జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే

కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీచేసింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది.

మొగల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని శాస్త్రీయసర్వే నిర్వహించి నిర్ధారించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సర్వేను వాయిదా వేసింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం