వరదలో కొట్టుకుపోయిన గ్యాస్‌ సిలిండర్లు

గుజరాత్‌లోని నవ్‌సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి.
భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరుణుడి తాకిడికి ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్‌ సిటీలో 219 మి.మీల వర్షపాతం నమోదుకావడంతో రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. నవ్‌సారీ, జునాగఢ్‌, ద్వారకా, భావ్‌నగర్‌, సూరత్‌, తాపి, వల్సాద్‌, అమ్రేలీ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

వరద ధాటికి పార్కింగ్‌ చేసిన పలు వాహనాలు కొట్టుకుపోయాయి. నవ్‌సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గుజరాత్‌లో ప్రస్తుత పరిస్థితికి ఇది అద్దం పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం