338
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీరేటు ఖరారైంది. ఖాతాల్లో ఉండే సొమ్ముపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం ఇవ్వాలని.. సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 ఏడాదిలో ఇచ్చిన 8.10శాతంతో పోల్చితే ఇది 0.05% అధికం.
కాగా, 2022 మార్చిలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించిన సంగతి తెలిసిందే. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఏడాదికి 8.1 శాతానికి తగ్గించింది. ఇది రెండో అత్యల్పంగా నమోదైంది. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన 8 శాతం వడ్డీరేటు అత్యంత తక్కువగా నిలిచింది.