ముప్పు ముంగిట్లో దిల్లీ

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. జీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటి చేరికతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో దిల్లీకి ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు.

యమునా ఉద్ధృతిపై స్పందించిన దిల్లీ ప్రభుత్వం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పింది. రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల దేశరాజధానిలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించింది. కాగా, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాతో మాట్లాడారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజ్‌ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. యమునా నదిలో నీటి మట్టం ఈ ఉదయం 9 గంటలకు 205.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది. సాయంత్రానికి ఇది 206.7 మీటర్లకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం