aiswaryaroy trolled on cannes film festival
Home » మొదటిసారి ట్రోలింగ్

మొదటిసారి ట్రోలింగ్

by admin
0 comment

అందాల తార ఐశ్వర్యరాయ్ కు కాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దశాబ్దానికి పైగా ఆమెకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ తో అనుబంధం ఉంది. ఆమె ఎప్పుడు కాన్స్ లో అడుగుపెట్టినా, రెడ్ కార్పెట్ పై మెరవాల్సిందే. ఆ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అలా ఐశ్వర్యరాయ్ కు కాన్స్ లో చెక్కుచెదరని ట్రాక్ రికార్డ్ ఉంది.

కానీ రికార్డులు ఎక్కువకాలం నిలబడవు. అందం శాశ్వతం కాదు. ఇప్పుడు ఐష్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవంలో అడుగుపెట్టిన ఐశ్వర్యరాయ్.. తన లుక్స్, డిజైన్స్ తో విమర్శల పాలవుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. కాన్స్ కు సంబంధించి ఐష్ పై ఇలా ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి.

అసలేం జరిగిందంటే.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఎప్పట్లానే మెరిసింది ఐశ్వర్య రాయ్. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ చాలామందికి నచ్చలేదు. పువ్వులు, ఆకులతో కప్పేసినట్టున్న ఆ గ్రీన్ కలర్ డ్రెస్ పై వెంటనే విమర్శలు మొదలయ్యాయి. ఆమె డ్రెస్ వేసుకోలేదని, అలా చుట్టుకొచ్చిందంటూ సెటైర్లు పడ్డాయి.

ఆ మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఈసారి మరో డిజైన్ తో రెడ్ కార్పెట్ పైకి వచ్చింది. ఆ డిజైన్ మరీ చెత్తగా ఉందంటున్నారు నెటిజన్లు. అల్యూమినియం షూట్ తో చేసిన ఆ ముసుగుపై ఓ రేంజ్ లో మీమ్స్ పడుతున్నాయి. నిజానికి ఐశ్వర్య రాయ్ ఫిజిక్ మారిపోయింది. ఆమె కాస్త బొద్దుగా తయారైంది. కాబట్టి దానికి అనుగుణంగా డిజైన్స్ ఎంచుకుంటోందామె. ఇదే విషయాన్ని చెబుతున్నారు డిజైనర్లు. దానికి నెటిజన్ల దగ్గర కౌంటర్ కూడా సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు రెడ్ కార్పెట్ పైకి రావడం ఆపేయాలని సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links