అహింస హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

టాలీవుడ్ కు మరో హీరోయిన్ పరిచయమౌతోంది. ఆమె పేరు గీతిక తివారి. నిజానికి ఎంతోమంది హీరోయిన్లు ఇఁడస్ట్రీకి ప్రతివారం పరిచయం అవుతుంటారు. అలాంటప్పుడు గీతిక గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే, ఈమె తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయమౌతోంది కాబట్టి. గతంలో తేజ దర్శకత్వంలో హీరోయిన్లుగా పరిచయమైన చాలామంది ఆ తర్వాత స్టార్ హీరోయిన్లు అయ్యారు.

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాజల్. అందుకే గీతిక ఇప్పుడు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఈమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? తేజ కళ్లలో ఎలా పడింది. గీతికది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్. ఆమె గ్రాడ్యూయేషన్ చదివింది. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ పై మోజుతో ఈ రంగంలోకి వచ్చింది.

కెరీర్ స్టార్టింగ్ లో కమర్షియల్ యాడ్స్ చేసింది. అదే టైమ్ లో సౌత్ సినిమా ఆమెను ఆకర్షించింది. తన ఊరిలో తెలుగు, తమిళ డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా ఆడుతాయంట. పైగా అక్కడి జనం యూట్యూబ్ లో సౌత్ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారట. అలా గీతికకు టాలీవుడ్ హీరోలు, దర్శకులు తెలిసొచ్చారు. అదే క్రమంలో తేజ ఓ హీరోయిన్ కోసం చూస్తున్నాడనే విషయం గీతకకు తెలిసింది. వెంటనే తేజ టీమ్ ను ఆమె సంప్రదించింది. ఆడిషన్స్ కు పిలుపొచ్చింది. గీతిక లుక్స్, ఆమె ఆడిషన్స్ చూసి వెంటనే తేజ సెలక్ట్ చేశాడు.

కొత్తవారిని పరిచయం చేయడంలో తేజది లక్కీ హ్యాండ్. కాబట్టి గీతక కూడా లక్కీ అనుకోవాలి. ఇక అహింస సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా స్టోరీ ఏంటనేది గీతికకు చెప్పలేదంట తేజ. కేవలం తన క్యారెక్టర్ ఏంటి.. అది ఎలా ఉంటుందనేది మాత్రం ఒక పారాగ్రాఫ్ లో వివరించాడట. ఈ సినిమాలో అహల్య అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించింది గీతిక. అమాయకంగా ఉండే ఈ పాత్ర ఎలా బలంగా మారిందో సినిమా చూసి తెలుసుకోవాలంటోంది.

దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న ఈ సినిమాతోనే గీతిక కూడా హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఈ సినిమా 90శాతం షూటింగ్ ను మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతాల్లోచేశారు. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400