ఈ వీకెండ్ ఏకంగా 8 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో కాస్త హైప్ తో వస్తున్న సినిమాలు నాలుగు మాత్రమే. ఆ సినిమాల డీటెయిల్స్ చెక్ చేద్దాం. ముందుగా అహింస గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ సినిమాతో రామానాయుడు మనవడు, సురేష్ బాబు చిన్న కొడుకు, దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్నాడు. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా తెరకెక్కిన సినిమా అహింస. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఇక అహింసతో పాటు థియేటర్లలోకి వస్తున్న సినిమా పరేషాన్. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాను రానా ప్రమోట్ చేస్తున్నాడు. ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. దీనికితోడు రిలీజ్ కు ముందే విజయవాడ, వరంగల్, కరీంనగర్ లో వేసిన స్పెషల్ ప్రీమియర్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఇక బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన రెండో సినిమా కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. దీని పేరు నేను స్టూడెంట్ సర్. ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. వీటితో పాటు ఈ శుక్రవారం వస్తున్న మరో సినిమా చక్రవ్యూహం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను పంపిణీ చేయడంతో, అందరి ఫోకస్ దీనిపై పడింది. ఈ సినిమాలతో పాటు.. అభిలాష, బంగారు తెలంగాణ, ఐక్యూ, స్పైడర్ మేన్ ఎక్రాస్ ది స్పైడర్ వర్స్ అనే సినిమాలు కూడా ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటికంటే ముందే సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను ఆల్రెడీ రిలీజ్ చేశారు.
166
previous post