Baby movie: ‘ఇది అందరూ గుర్తించాలి’ విశ్వక్‌సేన్‌

ఊహించని విధంగా బేబి సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత డైరక్టర్ సాయిరాజేష్ ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. తను ఓ హీరోకు ఈ కథ చెప్పడానికి ప్రయత్నిస్తే, అతడు కథ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆ డైరక్టర్ అయితే అసలు కథ కూడా విననని రిజెక్ట్ చేశాడంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆ హీరో విశ్వక్ సేన్ అనే విషయం వెంటనే బయటకొచ్చింది.

దీంతో విశ్వక్ సేన్ కూడా రియాక్ట్ అయ్యాడు. సినిమా హిట్టయినందుకు సెలబ్రేట్ చేసుకోవాలని, అశాంతి ఉండకూడదంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ఆ మేటర్ పై మరోసారి సవివరంగా స్పందించాడు విశ్వక్ సేన్. తనలాంటి హీరో ఎవరైనా చేస్తున్న పనిలో బిజీగా ఉన్నప్పుడు, ఎవ్వరికీ టైమ్ ఇవ్వలేరని, కథలు వినలేరని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నాడు.

తెలుగులో ఏ సినిమా హిట్‌ అయినా ఎక్కువశాతం ఆనందించేవాళ్లు ఉంటారని… ఏడ్చేవాళ్లు చాలా తక్కువ ఉంటారని.. గంట సేపు ఓ మనిషికి కూర్చోబెట్టి కథ విని తిరస్కరించడం ఇష్టం లేక తన నోటి నుంచి అలాంటి జవాబు వచ్చిందని.. చిన్న సినిమాగా మొదలైన ఆ చిత్రం పెద్ద హిట్‌ అయినందుకు అందరికంటే ముందు తనే ఆనందించాడనని అన్నాడు. డైరెక్టర్స్‌ గ్రూప్‌లో బేబి చిత్రం ట్రైలర్‌ బావుందని మొదటి స్పందించింది తనేనని, ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నాడు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దంటూ సూచించాడు. విశ్వక్ సేన్ తాజా స్టేట్ మెంట్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం