ధమ్కీ-2 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు

థియేటర్లలో సక్సెస్ అయిన ధమ్కీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని హీరో కమ్ దర్శకుడు విశ్వక్ సేన్ కన్ ఫర్మ్ చేశాడు. అయితే ఇప్పట్లో సీక్వెల్ రాదని కూడా స్పష్టం చేశాడు. తను 3 సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ నిర్మాతల్ని ఇప్పటికే వెయిట్ చేయించానని, కాబట్టి ఆ సినిమాలు పూర్తయిన తర్వాతే ధమ్కీ-2 వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది మార్చి తర్వాత సీక్వెల్ పనులు మొదలుపెడతానని ఎనౌన్స్ చేశాడు.

ధమ్కీతో పోలిస్తే, దాస్ కా ధమ్కీ పార్ట్-2 పది రెట్లు క్రేజీగా ఉంటుందని ప్రకటించాడు విశ్వక్ సేన్. అయితే ప్రస్తుతానికి తన దగ్గర లైన్ మాత్రమే ఉందని, డెవలప్ చేయాల్సి ఉందని స్పష్టం చేశాడు. మరోసారి తన నిర్మాతల్ని వెయిట్ చేయించలేనని, వాళ్ల కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత ధమ్కీ-2 ఉంటుందని తెలిపాడు.

ఈ సినిమాను ఫ్రాంచైజీలా కాకుండా.. ప్యూర్ సీక్వెల్ గా తీసుకొస్తానంటున్నాడు విశ్వక్. మొదటి సినిమాలో ఎవరెవరు నటించారో, సీక్వెల్ లో కూడా వాళ్లే ఉంటారని స్పష్టం చేశాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ గా నివేత పెతురాజ్ కొనసాగుతుందని కూడా క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ హీరో గామి అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమా ఇది. ఒక్క షెడ్యూల్ మినహా టోటల్ షూటింగ్ పూర్తయింది. ధమ్కీ తర్వాత విశ్వక్ సేన్ నుంచి రాబోయే సినిమా ఇదే.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400