వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పుకార్లే నిజం కాబోతున్నాయంటున్నారు చాలామంది. త్వరలోనే ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి, యంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఊహగానాలు ఎంతో కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ లో లావణ్య కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఇక వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం గట్టిపడింది. గతంలో వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ పై నెటిజన్లు అడగ్గా వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి.
దీంతో ఆ రూమర్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మధ్య మరోసారి తెరపైకి ఆ రూమర్స్ వచ్చాయి. ఈ డేటింగ్ వార్తలపై అటు వరుణ్ తేజే కానీ, ఇటు లావణ్య త్రిపాఠి కానీ ఎవరూ స్పందించలేదు. ఆ రూమర్స్ మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇప్పుడు అవే పుకార్లు నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహబంధంతో ఒక్కటి కానున్నారని టాక్ వస్తోంది.
అంతేకాకుండా ఈ నెల 9న వారు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోనున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మెగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయయ్యాని అంటున్నారు. ఇక పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ రాలేదు.