Trade Talk – గత వారం సినిమాల సంగతేంటి?

trade talk

ఎప్పట్లానే గతవారం కూడా కొన్ని సినిమాలు రిలీజయ్యాయి. అవన్నీ ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. మరి వాటి సంగతేంటి? ఏ సినిమా క్లిక్ అయింది? ఏ సినిమా ఫ్లాప్ అయింది? Lets Have a Look.

గతవారం ఏకంగా 9 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు కొన్ని మాత్రమే. ఆ కొన్ని సినిమాల్లో ఎన్ని నిలబడ్డాయో చూద్దాం. ముందుగా కస్టడీ విషయానికొద్దాం. నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ఇది. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు చైతూ. కచ్చితంగా హిట్ అవుతుందని ఆశపడ్డాడు. కానీ కస్టడీ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.

ఇక కస్టడీతో పాటు వచ్చిన సినిమా ఫర్హాన. ఐశ్వర్య రాజేశ్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా మంచి పాయింట్ తో తెరకెక్కింది. డైరక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ డీసెంట్ గా ఉన్నాయి. కానీ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు ఇది రైట్ టైమ్ కాదు. సమంత నటించిన సినిమాలే చూడడం లేదు జనం, ఇక ఐశ్వర్య రాజేష్ సినిమాలంటే చెప్పేదేముంది. అందుకే సినిమా బాగున్నా, ఫర్హానాకు కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. వాటిలో ఒకటి బ్యూటీఫుల్ గర్ల్, మరోటి భువనవిజయమ్. బ్యూటిఫుల్ గర్ల్ అనే సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. సునీల్, శ్రీనివాసరెడ్డి లాంటి నటులు నటించిన భువన విజయమ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ట్రయిలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా, థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించలేకపోతోంది. అటు బాలీవుడ్ లో రిలీజైన బెల్లంకొండ ఛత్రపతి సినిమా డిజాస్టర్ అయింది. ఓవరాల్ గా ఈ వారం థియేటర్లలో నిలబడిన సినిమా ఒక్కటి కూడా లేదు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400