పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోంది బ్రో మూవీ. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. మై డియర్ మార్కండేయ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీనిపై తమన్ స్పందించాడు.
బ్రో సినిమా ఫస్ట్ సాంగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిందనే విషయాన్ని అంగీకరించాడు తమన్. ఆ పాట కొంతమందికి నచ్చిందని, మరికొంతమంది మాత్రం తిట్టుకున్నారని అంగీకరించాడు. అయితే ఆ పాట కంపోజిషన్ లో తన తప్పు లేదంటున్నాడు ఈ సంగీ దర్శకుడు.
ఆ కథకు ఏం కావాలో అదే ఇచ్చానని, తను ఇచ్చిన ట్యూన్ ను దర్శకుడు-నిర్మాత కూడా ఓకే చేసిన తర్వాతే బయటకొచ్చిందని వెల్లడించాడు. ఎంత కడుపు ఉంటే అంతే అన్నం పెట్టాలని, బ్రో సినిమాకు కూడా కథకు తగ్గట్టు మాత్రమే ట్యూన్స్ ఇచ్చానని వెల్లడించాడు.
భీమ్లానాయక్ తరహాలో బ్రో సినిమాలో మాస్ ట్యూన్స్ లేవంటున్నాడు తమన్. ఇంకా చెప్పాలంటే, బ్రో లో కమర్షియల్ మ్యూజిక్ లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే హృదయానికి హత్తుకునే కొన్ని మూమెంట్స్ ఉన్నాయని, వాటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడానికి చాలా కష్టపడ్డానని అంటున్నాడు తమన్
ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది బ్రో మూవీ. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.