takkar review
Home » Takkar Movie Review – టక్కర్ మూవీ రివ్యూ

Takkar Movie Review – టక్కర్ మూవీ రివ్యూ

by admin
0 comment

తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు..
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
రన్ టైమ్: 2 గంటల 19 నిమిషాలు
రేటింగ్: 2/5

హీరో సిద్దార్థ్ టాలీవుడ్ లో కమ్ బ్యాక్ కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మినిమం గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు టక్కర్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈసారి పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ లాంటి బిగ్ సపోర్ట్ తో వచ్చాడు సిద్దార్థ్. కాబట్టి బిగ్ రిలీజ్ దక్కింది, భారీ ప్రమోషన్ కూడా దక్కింది. సో.. అంతా పాజిటివ్ గానే ఉంది. కంటెంట్ క్లిక్ అయితే చాలు, సిద్ధూ బౌన్స్ బ్యాక్ అయినట్టే. సరిగ్గా ఇక్కడే మేటర్ తిరగబడింది. టక్కర్ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ను చితక్కొట్టి వదిలేసింది. ఏ దశలోనూ కొత్తదనం చూపించని ఈ సినిమా, ప్రేక్షకుల్ని పిచ్చెక్కేలా చేసింది. ఇంతకీ కథేంటో చూద్దాం..

గుణశేఖర్ అలియాస్ గన్స్, అల్లరిచిల్లరిగా పెరిగిన వ్యక్తి. ఎలాగైనా డబ్బు సంపాదించాలనేది ఇతడి లక్ష్యం. డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్టు ఫీల్ అయ్యే రకం. ఇతడికి కంప్లీట్ రివర్స్ లక్కీ. ఓ ధనవంతురాలి బిడ్డ. అన్ని సమస్యలకు డబ్బే మూలం అని నమ్మే అమ్మాయి. వీళ్లిద్దరూ ఎలా కలిశారు.. ఎఁదుకు కలిశారు.. అనేది బేసిక్ లైన్. ఈ సినిమాలో అమ్మాయిల అక్రమ రవాణా మెయిన్‌ ప్లాట్‌. అనుకోకుండా ఈ ఉచ్చులో చిక్కుకుంటాడు హీరో. ఇది హీరోయిన్‌తో దూరాన్ని పెంచుతుంది. తాను చేస్తున్నది తప్పని తెలుసుకుని హీరో ఎలా మారాడు. హీరోయిన్‌ను ఎలా దక్కించుకున్నాడు. విలన్లకు ఎలా బుద్ధి చెప్పాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

ఇలాంటి కథల్లో క్లయిమాక్స్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అదొక పరమ రొటీన్ క్లయిమాక్స్. అలాంటప్పుడు మిగతా నెరేషన్ అయినా గ్రిప్పింగ్ గా ఉండేలా చూసుకోవాలి కదా. ఆ ప్రయత్నం పది శాతం కూడా చేసినట్టు కనిపించదు. సినిమా స్టార్ట్ అవ్వడమే ఫ్లాష్ బ్యాక్ తో రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. అయితే ఉన్నంతలో ఫస్టాఫ్ బాగుంది, టైమ్ పాస్ అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ టైమ్ కు ఇలా అనిపించదు. సెకెండాఫ్ కంప్లీట్ అయిన తర్వాత, ఫస్టాఫ్ నచ్చుతుంది. దీన్నిబట్టి సెకెండాఫ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్టాఫ్ లో స్క్రీన్ ప్లే, అక్కడక్కడ వచ్చే కామెడీ ఫర్వాలేదు. హీరోయిన్ దివ్యాంష అందంగా, చురుగ్గా కనిపించింది. సిద్దార్థ్ ను యాక్టివ్ గా చూడ్డానికి ఇష్టపడతారు తెలుగు ఆడియన్స్. ఇందులో ఎందుకో అతడు చాలా బద్దకంగా కదులుతాడు. అతడ్ని ఇష్టపడేవాళ్లకు ఇది నచ్చదు.

అలా టైమ్ పాస్ అనిపిస్తూ, ఇంటర్వెల్ కార్డ్ వేసిన దర్శకుడు.. సెకండాఫ్ కు వచ్చేసరికి ఎలాంటి కొత్తదనం చూపించలేకపోయాడు. రెండో భాగం భయంకరంగా ఉంది. ఆ సన్నివేశాలు ఎందుకు రాసుకున్నాడో, ఈ తీయడం ఏంటో, ఆ స్క్రీన్ ప్లే ఏంటో బొత్తిగా అర్థం కాదు. అసలు దర్శకుడు కాస్తయినా వర్క్ చేసి సెట్స్ పైకి వచ్చాడా అనిపిస్తుంది. డైరక్షన్ డిపార్ట్ మెంట్ పై కాస్త అవగాహన ఉన్న సిద్దార్థ్ ఏం చేస్తున్నట్టు.. పరమ చెత్త సన్నివేశాల్లో నటించడానికి అతడికి మనసెలా వచ్చింది. అసలు అతడు ఎలా ఒప్పుకున్నాడు..? ఆ లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎలాంటి ఎమోషన్ పండలేదు ఆ ట్రాక్ లో. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన సిద్దూనే ఇలా చేశాడా అని మనకు మనం గిల్లుకొని చూసుకోవాల్సిన పరిస్థితి. థియేటర్ నుంచి బయటకు వెళ్లలేక, లోపల కూర్చోలేక, సీట్లో అటుఇటు నలుగుతున్న టైమ్ లో ప్రీ-క్లయిమాక్స్ లోకి ఎంటర్ అవుతుంది సినిమా. ఇక అక్కడ్నుంచి టార్చర్ పీక్ స్టేజ్ కు వెళ్తుంది. సాంగ్స్ వచ్చినప్పుడల్లా చచ్చిపోవాలనిపిస్తుంది. కేవలం కొన్ని కామెడీ సీన్లు మాత్రమే వర్కవుట్ అయిన ఈ సినిమాను, రొటీన్ క్లయిమాక్స్ తో ముగించి, పెద్ద నిట్టూర్పు విడిచి బయటకు రావడమే బ్యాలెన్స్. ఇంతోటిదానికి నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి, టెక్నీషియన్స్ పనితీరు గురించి మాట్లాడుకోవడం అనవసరం.

ఓవరాల్ గా టక్కర్ సినిమా చిరాకు తెప్పిస్తుంది. తను ఏ సినిమా చేసినా తన అనుమానాలన్నీ దర్శకుడ్ని అడుగుతానని, లాజిక్ మిస్సయితే వెంటనే ప్రశ్నిస్తానని, తన డౌట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాతే సెట్స్ పైకి వస్తానని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఘనంగా చెప్పుకున్నాడు సిద్దార్థ్. అయితే ఈ సినిమాకు అలా లాజిక్స్ అడగడం మరిచిపోయినట్టున్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links