ఇన్‌స్టాలో టాప్‌ హీరోయిన్లు వీరే

హీరోహీరోయిన్లకు ఇనస్టాగ్రామ్ అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. ఒకప్పుడు ట్విట్టర్ లో రాజ్యమేలిన తారలంతా, ఇప్పుడు ఇనస్టాగ్రామ్ పై మొగ్గుచూపుతున్నారు. ట్విట్టర్ లో ట్రోలింగ్, నెగెటివిటీ ఎక్కువైపోవడంతో.. చాలామంది ఇనస్టాగ్రామ్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో చాలామంది హీరోయిన్లు ఎట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఇనస్టాగ్రామ్ లో అత్యథిక ఫాలోవర్స్ కలిగిన తెలుగు హీరోయిన్లు ఎవరు.. వాళ్ల ఫాలోయింగ్ ఎంత.. హేవ్ ఏ లుక్..

ఇనస్టాలో అత్యథిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా ప్రియాంక చోప్రా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ సంఖ్య 88 మిలియన్ల పైమాటే. ఈమె తర్వాత రెండో స్థానంలో శ్రద్ధాకపూర్ ఉంది. శ్రద్ధాకు ఇనస్టాగ్రామ్ లో 81 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇనస్టాగ్రామ్ హీరోయిన్లలో మూడో స్థానంలో అలియాభట్ కొనసాగుతోంది. ఈమె పాలోవర్స్ సంఖ్య 78 మిలియన్లు. నాలుగో స్థానంలో, 74 మిలియన్ల ఫాలోవర్స్ తో దీపిక పదుకోన్ కొనసాగుతోంది. ఐదోస్థానంలో నేహా కక్కర్, ఆరోస్థానంలో కత్రినా కైఫ్ కొనసాగుతున్నారు.

ఈ ఆరుగురు హీరోయిన్లతో పోలిస్తే.. టాలీవుడ్ హీరోయిన్లు చాలా దూరంలో ఉన్నారు. లిస్ట్ లో దిశాపటానీకి చోటు దక్కింది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 58 మిలియన్లు. ఇక ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ ను ఇనస్టాగ్రామ్ లో 54 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

నేషనల్ క్రష్ రష్మికను ఇనస్టాగ్రామ్ లో 38 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సౌత్ నుంచి చూసుకంటే, హయ్యస్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ రష్మికనే. ఈమె తర్వాతే మిగతా సౌత్ హీరోయిన్లంతా ఉన్నారు.

కియరా అద్వానీ, సమంత ఇనస్టాగ్రామ్ లో పోటీ పడుతున్నారు. సై అంటే సై అంటున్నారు. కియరా అద్వానీ 30 మిలియన్లకు పైదా ఫాలోవర్స్ తో దూసుకుపోతుంటే.. ఈమెను అందుకోవడానికి 28 మిలియన్ల ఫాలోవర్స్ తో సమంత రేసులో నిలిచింది. మరో 3-4 నెలల్లో కియరాను సమంత బీట్ చేస్తుందనేది ఓ అంచనా

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పుకోవాలి. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తెలుగులో ఆమెకు బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ఇనస్టాగ్రామ్ లో ఆమె కంటే నిధి అగర్వాల్ కే ఫాలోవర్స్ ఎక్కువ. కాజల్ ను 25.8 మిలియన్ల మంది ఫాలో అవుతుంటే.. నిధి అగర్వాల్ ను 27 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇనస్టాగ్రామ్ లో కాజల్ పైన నిధి అగర్వాల్ దే పైచేయి.

ఇక అనన్య పాండే 24.5 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతోంది. ప్రతి రోజూ అప్ డేట్స్ ఇస్తున్నప్పటికీ ఎందుకో ఈమెకు ఫాలోవర్స్ పెరగడం లేదు. బాక్సాఫీస్ హిట్ లేకపోవడం ఈమెకు మైనస్ అయింది.

పూజాహెగ్డే 23.8 మిలియన్ల ఫాలోవర్స్ తో ఇనస్టాగ్రామ్ ను ఏలుతోంది. ఈమెకు ఇటు సౌత్ తో పాటు, అటు బాలీవుడ్ లో కూడా మంచి బేస్ ఉంది. సల్మాన్ తో సినిమా చేసిన తర్వాత ఈమెకు ఫాలోవర్స్ అమాంతం పెరిగారు. ప్రస్తుతం ఈమె తన బేస్ ను పెంచుకునే పనిలో ఉంది.

శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్.. దాదాపు సమానమైన ఫాలోవర్స్ తో ఇనస్టాగ్రామ్ లో ఉన్నారు. చెరో 23 మిలియన్ల మంది ఈ ముద్దుగుమ్మల్ని ఫాలో అవుతున్నారు.

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ 21.5 మిలియన్ల ఫాలోవర్స్ తో.. తమన్నా 21.4 మిలియన్ల ఫాలోవర్స్ తో ఇనస్టాగ్రామ్ లో కొనసాగుతున్నారు. వీళ్లకు కూడా బాలీవుడ్ లో సరైన హిట్ లేకపోవడం వల్ల ఫాలోవర్స్ పెరగడం లేదు. ఎప్పుడైతే హిట్ వస్తుందో, అప్పుడిక వీళ్లు లీక్ లోకి ఎంటర్ అవుతారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి వీలైనంత త్వరగానే ఈ లిస్ట్ లో మార్పుచేర్పులు చోటుచేసుకోవడం ఖాయం. కాకపోతే ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ రేంజ్ ను అందుకోవడం మాత్రం చాలామంది హీరోయిన్లకు కష్టం కావొచ్చు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం