SreeLeela – మళ్లీ పెంచేసింది

కెరీర్ స్టార్ట్ చేసి పట్టుమని ఐదేళ్లు కూడా కాలేదు. అప్పుడే అగ్రస్థానానికి ఎగబాకింది శ్రీలీల. అంతేకాదు, ఈ ఐదేళ్లలో 30 లక్షల రెమ్యూనరేషన్ నుంచి ఏకంగా కోటి 20 లక్షలు పారితోషికం అందుకునే స్థాయికి చేరిపోయింది.

పెళ్లి సందడి సినిమాలో శ్రీలీలకు 30 లక్షలు ఇచ్చారు. అదే ఆమెకు తెలుగులో తొలి సినిమా. అంతకంటే ముందు కన్నడలో ఆమె నటించింది. అందుకే ఆమెకు 30 లక్షలిచ్చారు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీలకు అమాంతం అవకాశాలు పెరిగాయి. దీంతో నిర్మాతలే ఆమెకు 50 లక్షలు ఫిక్స్ చేశారు.

ఆ తర్వాత 50 లక్షల నుంచి 75 లక్షలు లాక్ అయింది. సరిగ్గా 2 నెలల కిందటే ఆమె కోటి రూపాయల మార్క్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా తన రెమ్యూనరేషన్ ను కోటి 20 లక్షల రూపాయలకు పెంచేసింది. ఇక్కడ ఓ గమ్మత్తైన విషయం ఉంది.

శ్రీలలకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిన సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇప్పుడు అదే సంస్థ, శ్రీలలకు కోటి 20 లక్షల రూపాయలు అందిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా లాంఛ్ చేసిన ఈ సంస్థ, అందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకుంది. కోటి 20 లక్షల రూపాయలు అందిస్తోంది.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. పైన చెప్పుకున్న సినిమాలతో పాటు పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. అటు మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్, నితిన్, రామ్ సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400